Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే అందరితో సమానంగా ఆడిపిల్లలను ఎదగనీయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ పథకాన్ని ప్రారంభించారని సత్తుపల్లి శాసనసభ్యుల సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండలంలోని 137 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1,37,15,892 విలువ గల చెక్కులను పెనుబల్లిలోని సప్తపది గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పెళ్ళి కానుకగా నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం నిర్విరామంగా కొనసాగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.