Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-అశ్వాపురం
తమను అబాసు పాలుచేసేందుకు ఓ దినపత్రిక రాస్తున్న తప్పుడు కథనాల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటు న్నాయంటూ అమ్మ గారిపల్లి పంచా యతీలోని కుమ్మరిగూడెం వాసులు గురువారం ఎమ్మెల్యే రేగా కాంతారావు, తహశీల్దార్ వి. సురేష్ కుమార్‌కు వినతి పత్రాలను అందజేసారు. సర్వే నెంబర్ 28లోని భూములలో తమ తాతాతండ్రుల కాలం నుండి రెండవ పంటగా మినుములు, జనుములు, పుచ్చ వంటి పంటలను పండించుకున్నారని తెలిపారు. వారి వారసత్వంగా తాము ఇప్పుడు సాగు చేస్తు వస్తున్నామన్నారు. అటువంటి భూములలో పిడి, పిఎం జాబితాలో తమ పేర్లు నమోదు అయి ఉన్నాయని వారు తెలిపారు. అందుకు ప్రభుత్వం తమకు చెక్కులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకుని సీతమ్మ సాగర్ బహుళార్దక ప్రాజెక్టుకు అప్పగిస్తే తమ భూములలో పాకలు, వాహనాలు నిలపడంతోపాటు ప్రాజెక్టు నుండి వెళికి తీసిన మట్టిని పోసారన్నారు. ఈ భూములకు 30 అక్టోబర్ 2019లో పట్టాలు జారీ చేయాలని నాటి సబ్ కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసి వారిలో పాయం భద్రయ్య, నర్సింహరావు, వినోద్‌కుమార్ రైతులు పాల్గొన్నారు.