Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం వామపక్ష పా సీపీఎం ఖమ్మం 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు రోడ్డులో ఉన్న యూనియన్ బంక్ దగ్గర నిరసన చేపట్టారు. వజేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా పన్నులు వేస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతున్నాయన్నారు. ధరలు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి తూశాకుల లింగయ్య, కార్పొరేటర్ యల్లంపల్లి వెంకటరావు, బండారు యకయ్య, పత్తి పాక.నాగ సులోచన, షేక్.హిమామ్,షేక్.బాబు, సారాంగిపాపారావు, సుగ్గాల.హన్మంత రావు, వట్నా,ఎల్ .బాబు, షేక్.గౌస్, షేక్.ఖాసిం, వెంకటనారాయణ, రంగారావు, చెరుకుపల్లి.కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పై వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
కొణిజర్ల : గతకొద్ది రోజులుగా విచ్చలవిడిగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ వామపక్షాల అద్వర్యంలో మండల కేంద్రంలో ని పెట్రోల్ బంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య వీరభద్రం, సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా బాబు, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు దొండపాటి రమేష్, కొప్పుల క్రిష్ణయ్య, సీపీఐ(ఎం), సీపీఐ మండల కార్యదర్శులు తాళ్లపళ్లి క్రిష్ణ, వేములకొండ రమేష్, డాక్టర్ బోయినపల్లి శ్రీనివాస్ రావు, జోనెబోయిన అంజయ్య, తేజావత్ క్రిష్ణకాంత్, బుర్రి గోపయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ ఎదుట సీపీఐ(ఎం), సీపీఐ ఎంఎల్ పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీయం పెనుబల్లి మండల కార్యదర్శి చలమాల విఠల్ రావు, ఎంఎల్ (న్యూడెమొక్రసీ) మండల కార్యదర్శి బీరెల్లి లాజర్, సిపిఎం మండల నాయకులు మామిళ్ల వెంకటేశ్వర్లు, నల్లమల్ల అరుణ ప్రతాప్, మేకల బాజీ, కోటా తిరుపతిరావు, వెంకటేశ్వరరావు, దేవర . ఆదినారాయణ, ఎంఎల్ (న్యూడెమొక్రసీ) మండల నాయకులు పాల్గొన్నారు.
పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని నిరసన
తల్లాడ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని అని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అయినాల రామలింగేశ్వర రావు, నల్లమోతు మోహన్ రావు, తమ్మిశెట్టి శ్రీను, సూరంపల్లి గోపాల్ రావు, కళ్యాణం కిష్టయ్య, పులి కృష్ణయ్య, షేక్ నన్నే సాహెబ్ పాల్గొన్నారు.
వేంసూరు : మండల పరిధిలోని మర్లపాడు చౌరస్తాలో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్, సీపీఎం మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావులు, నాయకులు మోరంపుడి వెంకటేశ్వరరావు, అర్వపల్లి వెంకటేశ్వరరావు, కర్రీ చంద్ర మోహన్, రామలక్ష్మి, నారాయణరావు, బూరుగు శ్రీదేవి పాల్గొన్నారు.
కల్లూరు : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల, ధరలను అదుపు చేయాలని తక్షణమే ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం ఆయిల్ బంకు వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కల్లూరు మండల కార్యదర్శి తన్నీరు క్రిష్ణార్జునరావు మాట్లాడారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం), సీఐటీయు నాయకులు కంచపోగు వెంకటరత్నం, పర్వేజ్ గొర్రెపాటి రాధయ్య, మోదుగు క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వామపక్షాల ధర్నా ఆందోళన
నేలకొండపల్లి : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా గురువారం స్థానిక ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక సిపిఎం కార్యాలయం నుండి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు నినాదాలు చేసుకుంటూ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరి రామారావు, నాయకులు కెవి రెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, చెన్నారం పీఏసీఎస్ చైర్మన్ వందనం నాగేశ్వరరావు, మారుతి కొండలరావు, సామల మల్లికార్జునరావు, దేపంగి యేసు, సిపిఐ మండల నాయకులు మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.