Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కాలనీలో రెండో రోజు వైద్యశిబిరం
- నిర్ధారణ పరీక్షలకు తాగునీరు నమూనాలు : డీఎంఅండ్‌హెచ్‌ఓ
నవతెలంగాణ-అశ్వారావుపేట
అధిక మొత్తంలో అనారోగ్యం పాలైన నారాయణపురం ఎస్సీ కాలనీ వాసుల ఉదాంతం నవతెలంగాణ ద్వారా వెలుగు చూడటంతో బుధవారం స్థానిక మండల స్థాయి ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీసిన నేపధ్యంలో వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారిణి డాక్టర్ శిరీష మండలంలో గురువారం ఆకశ్మిక పర్యటన చేసి అధికారులను హాశ్చర్యానికి గురి చేసారు. నేరుగా వారు గుమ్మడవల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని సంబంధిత వైద్యులు హరీష్‌కు ఫోన్ చేసారు. ఆ సమయం ఆయన ఎస్సీ కాలనీలో రెండో రోజు వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని తెలపడంతో శిరీష్ ఆరోగ్య కేంద్రం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులను తనిఖీ చేసారు. అనంతరం బాలింతకు కెసీఆర్ కిట్ అందజేసారు. అక్కడ నుండి నారాయణపురం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరం వద్దకు చేరుకుని ఆ గ్రామస్తులతో మాట్లాడారు. ఎంత మంది అనారోగ్యానికి గురి అయ్యారు, ఎక్కడెక్కడ చికిత్స పొందుతున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నీటిలో ఏ తేడా ఉందో తెలుసు కోవడానికి నిర్ధారణ పరీక్షలకు నీటి నమూనాలను పంపించామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు. ఈ వెద్యశిభిరంలో 35 మందిని పరీక్షించి, నలుగురును జ్వరపీడితులుగా నిర్ధారించి వారికి మలేరియా, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రెండూ లేక పోవడంతో సాధారణ జ్వరం మందులు అందజేసారు. మలేరియా రాకుండా దోమలు నివారణకు 250 కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంగాల పరమేష, వైద్యారోగ్య శాఖ సబ్ యూనిట్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, హెల్త్ విజిటర్ దుర్గమ్మ, ఎఎన్ఎం సీతికుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.