Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం డబ్బులు రైతులకు జమ చేయాలి
- ఖమ్మం మిర్చి మార్కెట్ అడ్డాగా జరుగుతున్న దందాపై సమగ్ర దర్యాప్తు జరపాలి
- తెలంగాణ రైతుసంఘం వినతి
నవతెలంగాణ-ఖమ్మం
వ్యవసాయ సీజన్ ప్రారంభం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణా ప్రణాళిక విడుదల చేయలేదని, వెంటనే ప్రభుత్వం వ్యవసాయ రుణా ప్రణాళిక విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బెరర్స్ సమావేశంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన యాసంగి ధాన్యం డబ్బులు వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం వ్యవసాయ పెట్టుబడులు రాక, ఈ వ్యవసాయ సీజన్ అవసరాలకు డబ్బులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం 7 నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా అఖిల భారత కిసాన్ మెర్చా పిలుపు మేరకు జూన్ 26న అని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ''సేవ్ డెమోక్రసి, సేవ్ అగ్రికల్చర్'' నినాదంతో రైతులు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ మాట్లాడుతూ ఖమ్మం మిర్చి మార్కెట్ అడ్డాగా జరుగు తున్న అక్రమ దందాపై సమగ్ర దర్యాప్తు జరపాలని, రైతులకు డబ్బులు చెల్లించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు తాతా భాస్కర్రావు, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.