Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను భాగస్వామ్యం చేస్తూ
- దశలవారీగా ఉద్యమం
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ - వైరాటౌన్
వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను వంద పడకల ఆసుపత్రిగా ఆఫ్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ దశలవారీగా జరిగే ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ పిలుపు నిచ్చింది. శుక్రవారం వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర ప్రభుత్వ వైద్యశాలలను వంద పడకల ఆసుపత్రులుగా ఆఫ్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం చేయడం హర్షణీయని అన్నారు. సత్తుపల్లి, మధిర ప్రభుత్వ వైద్యశాలల తోపాటు వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను ఆఫ్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్న గిరిజన, పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేవిధంగా వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ బారినపడి చనిపోయిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించాలని, అనేక కుటుంబాలు కరోనా వైరస్ సోకి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నరని అన్నారు. వైరా మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో డంప్పింగ్ యార్డు ఏర్పాటు చేయాలని, సిసి రోడ్లు నిర్మాణంను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు మల్లెంపాటి రామారావు, బొంతు సమత, అనుమోలు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, పైడిపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.