Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
ద్వాక్రా రుణాల కేటాయింపులలో గ్రామ దీపిక లు కమీషన్ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని కమీషన్లు ఇవ్వలేని నిరుపేద మహిళలకు తీవ్రంగా వేధిస్తున్నారని అమ్మగూడెం గ్రామ సర్పంచ్ గండు సతీష్ ఆరోపించారు. గ్రామంలో జరిగే అభివృద్ధి పనులలో సైతం గ్రామ దీపికలు పాల్గొనడం లేదని అన్నారు. అంగన్వాడి టీచర్లు సర్పంచులకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని ఆచర్లగూడెం గ్రామ సర్పంచ్ రేగురి శ్రావణ్ కుమార్ విమర్శించారు. గత మూడు నెలల క్రితం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, నిర్ణయాలపై అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారో స్పష్టం చేయాలని నేలకొండపల్లి ఎంపిటిసి బొడ్డు బొందయ్య ప్రశ్నించారు. గతంలో ఇక్కడ పనిచేసిన మండల అధికారి ఇంకుడు గుంతలు నిర్మించండి, పంట కల్లాలను ఏర్పాటు చేయమని ప్రజా ప్రతినిధులను తీవ్రంగా ఒత్తిడి చేసి నేడు నిర్మాణం చేసిన వాటి బిల్లుల చెల్లింపులలో జాప్యం చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ పి.నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను ఈ మండలానికి కొత్తగా వచ్చానని, గతంలో ఇక్కడ పనిచేసిన వెళ్ళిన ఎంపీడీవోను బ్లేమ్ చేయవద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేటి నుండి మండలంలో జరిగే అభివద్ధి సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో సమిష్టి భాగస్వామ్యంతో ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, డిప్యూటీ తాసిల్దారు వనజ, ఎంపీవో నెల్లూరు వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి ఎస్వికె నారాయణరావు, ఈజీఎస్ ఏపిఓ సునీత, మండల వైద్యాధికారి రాజేష్, పశు వైద్యాధికారి డాక్టర్ సంజరు రెడ్డి, ఆర్ అండ్ బి జేఈ కష్ణమోహన్, పిఆర్ఏఈ విద్యాసాగర్, ఎంఈవో బి రామాచారి, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ రాయపూడి నవీన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.