Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా భూమికి పాస్ బుక్ ఇప్పించండి
- ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన
నవతెలంగాణ- కల్లూరు
''మా తాత ముత్తాతల నుండి భూమి మా సాగులో ఉండి... మా పేరుతో అన్ని రకాలుగా రికార్డ్ ఉన్న భూములకు మాకు పాస్ బుక్ ఇవ్వకుండా వేరే వారికి పాస్‌పుస్తకాలు ఇచ్చిన సత్తుపల్లి గత తహశీల్దార్ దోడ పుల్లయ్యపై చర్యలు తీసుకోని...మాకు న్యాయం చేయలి'' అంటూ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు.సత్తుపల్లికి చెందిన దళితులు కోలేటి వెంకటేశ్వర్లు, కోలేటి రాములు, కోలేటి నరసింహారావు, కోలేటి కృష్ణ కుటుంబ సభ్యులు ఆర్డిఓ సిహెచ్. సూర్యనారాయణకి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1956 నుండి మా తాత అయిన కోలేటి వీరయ్య పేరుతో పహాణీలో వస్తూ మా సాగులో ఉన్నటువంటి సర్వే నెంబరు, 105రూలో రెండున్నర ఎకరాలు, 105ఈలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు కోలేటి నాగమ్మ పేరుతో 36 గుంటల భూమి ఉంది. ఇది మొత్తం 56 సంవత్సరాల నుంచి మా సాగులో వస్తూ ఉన్నటువంటి భూమిని బండి రామి రెడ్డి కుమారుడు బండి రఘుపతి రెడ్డి ఆక్రమించి దొంగ పాస్ బుక్ చేయించుకున్నాడు. దీనిపై మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి , అట్టి భూమిని డిగ్రీ పొందడం జరిగింది. ఆ తర్వాత 2017లో 105 ఈలో ఎటువంటి భూమి లేని అటువంటి పరస కృష్ణ పేరుతో అప్పటి తాసిల్దార్ దొడ్డ పుల్లయ్య ఎకరం రెండుకుంటల భూమిని పాస్ బుక్ చేయడం జరిగింది. అట్టి పాసుబుక్ పొందిన కృష్ణ 105 రూలో ఉన్నటువంటి మా భూమి పైకి వచ్చి ఆక్రమించి 105ఈ నాది అంటూ మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపారు.. ఈ విషయాన్ని అనేకసార్లు సత్తుపల్లి రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కరించలేదన్నారు. ఈ విషయమై 105ఈలో ఎలాంటి భూమి లేదంటూ తాసిల్దారు ఆర్టిఏ యాక్ట్ కింద సర్టిఫై చేయడం జరిగింది. కాబట్టి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికైనా మా భూమి ఇచ్చి మా భూమి పైకి అక్రమంగా ఆక్రమించిన సదరు వ్యక్తి పాసుబుక్ చేసిన, అప్పటి రెవెన్యూ అధికారులైన తహసిల్దార్, ఆర్ఐ, వీఆర్ఒల పై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆత్మ హత్య తప్ప వేరే మార్గం లేదని వారు ఆర్డిఓ ముందు వాపోయారు,