Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యంగా పనిచేయాలి : సీపీ
నవతెలంగాణ- ఖమ్మం
సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యంగా నిబద్దతతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో కొనసాగుతున్న 2019-20 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. సాంకేతిక వినియోగం, నేరాల అదుపు, బందోబస్తు చర్యలు, కేసుల దర్యాప్తు, కోర్టులో చార్జిషీటు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేయాలంటూ విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పించారు. ప్రజలకు మరింత దగ్గరవ్వాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కొత్త ఎస్ఐలకు మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.