Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
నవతెలంగాణ- సత్తుపల్లి
వర్షాకాలం ప్రారంభమైన నేపధ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడే అవకాశం ఉన్న నేపధ్యంలో మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీటి ప్రజలకు అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంబంధిత అధికారులను కోరారు. శుక్రవారం సత్తుపల్లిలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్, డీఈ స్వరూపరాణితో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల జేఈలతో ఎమ్మెల్యే సండ్ర సమీక్ష జరిపారు. గ్రామంలో మంచినీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందించడానికి ఆయా గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంకులను శుభ్రపర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ పాల్గొన్నారు.