Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు గ్రామాలను హై రిస్క్ గ్రామాలుగా గుర్తింపు
- కరోనా టీకా వేయించుకున్నా నిర్లక్ష్య ధోరణి వద్దు
- వైద్యాధికారి డాక్టర్ సుధీర్
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
పాల్వంచ మండలంలో ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు వైద్య అధికారి సుదీర్ నవతెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కోవిడ్ నియంత్రణలో భాగంగా మీ ఆరోగ్య కేంద్రం పరిధిలో తీసుకున్న చర్యలు ఏమిటి ?
లాక్ డౌన్ సమయంలో జ్వరం వచ్చిన వారిని గుర్తించి రాపిడ్ టెస్ట్ నిర్వహించి వారికి మెడికల్ కిట్లు అందజేశాం. ప్రతి గ్రామంలోని ఆశా వర్కర్లకు మెడికల్ కిట్లు అందించి, కరోనా వచ్చిన వారిని బయటకు రానీయకుండా ఇంటి వద్దకు వెళ్లి కిట్లు అందజేశాం. దీని ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా కొంతమేరకు నియంత్రిం చగలిగాము. ఈ విషయంలో సిబ్బంది అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించారు.
టీకా కార్యక్రమం ఏ విధంగా నడుస్తుంది ?
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటగా 45 యేండ్లు పైబడిన వారికే టీకా వేశాం. ఆ తరువాత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి టీకా వేశాం. ప్రస్తుతము ఉపాధ్యా యులకు టీకాలు వేస్తున్నాము. ఆరోగ్య కేంద్రం పరిధిలో సుమారు 95 శాతం టీకాలు పూర్తయ్యాయి.
ప్రస్తుతం కరోనా కేసులు ఏమైనా ఉన్నాయా ?
ఆరోగ్య కేంద్రం పరిధిలో పాజిటివ్ కేసులు ఏమీ లేవు. కానీ 40 యాక్టివ్ కేసులు మాత్రం ఉన్నాయి.
సీజనల్ వ్యాదుల దృష్ట్యా హైరిస్క్ గ్రామాలను ఏమైనా గుర్తించారా ?
ఆరోగ్య కేంద్రం పరిధిలో ఐదు గ్రామాలను గుర్తించాము. రాయి చిలక, పెద్ద కలస, తిరుకల పాడు, మల్లారం, మందెర కలపాడు.
సీజనల్ వ్యాధుల దృష్ట్యా నియంత్రణకు ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేశారా?
సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాలలో హెల్త్ క్యాంపులో ఏర్పాటు చేశాం. యాంటీ లార్వా మెజర్స్ ఫ్రైడే... డ్రైడే ఐఆర్ఎస్ స్ప్రే లాంటి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేశాము.
కేంద్రం పరిధిలో ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతాయి. ప్రజలు దోమకాటుకు గురికాకుం డా ఉండేందుకు దోమతెరలు పంపిణీ చేస్తున్నాము.
వైద్యశాలలో అన్ని రకాల ఇంజక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నాయా ?
వైద్యశాలలో పాము, కుక్క కాటు తదితర అన్ని రకాల సంబంధించిన ఇంజక్షన్లు మందులు అందుబాటులోనే ఉన్నాయి. మందుల కొరత లేదు.
ప్రజలకు మీరిచ్చే సూచనలు, సలహాలు ఏమిటి ?
ప్రజలందరూ టీకా వేసుకున్నామని నిర్లక్ష్యంగా ఉండకూడదు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. జ్వరం వచ్చినట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు దృష్ట్య కేంద్రం పరిధిలో మలేరియా వ్యాధులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ దోమ తెరలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా వేడిచేసి చల్లార్చిన నీటిని తాగడం ద్వారా టైఫాయిడ్ బారిన పడకుండా ఉండవచ్చు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.