Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని ఖమ్మం మాజీ ఎంపీ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలో శుక్రవారం పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మేనల్లుడు ప్రతాప్ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడు ప్రతాప్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతాప్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అశ్వారావుపేట మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య కుమార్తె గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. పేరాయిగూడెం చేరుకుని పుల్లయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అలాగే ఇటీవల మృతి చెందిన మల్లు బాబు, కూరగాయలు వెంకటేశ్వరరావు, పుట్టి శ్రీరామమూర్తి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజరు బాబు, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దిశా కమిటీ చైర్మన్ జూపల్లి రమేష్, డీసీసీబీ సెంట్రల్ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, సర్పంచ్ అట్టం రమ్య, తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తల్లాడలో కరోనా వ్యాధితో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నారాయణపురం గ్రామంలో మాజీ సర్పంచ్ వేమిరెడ్డి కృష్ణారెడ్డి, వేమిరెడ్డి నాగమ్మ వేమిరెడ్డి వెంకటరమణ, తల్లాడకు చెందిన దగ్గుల సంజీవరెడ్డి, చిత్రపటలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజరు బాబు, డాక్టర్ మట్టా దయానంద్, దయాకర్ రెడ్డి, తూము వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.