Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-పాల్వంచ
ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన దళిత కుటుంబంపైన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు మోపబడి అంబటిపూడి మరియమ్మ అనే దళిత మహిళ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్‌కు గురైన ఘటన పైన ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి, సంబంధిత బాధ్యులపైన అట్రాసిటీ చట్టం కింద కేసుతో పాటు హత్యానేరం కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సమావేశం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మేరుగు ముత్తయ్య అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంకి ముఖ్య అతిధిగా హాజరైయిన మచ్చా మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్రెండ్లి పోలీసులు రాక్షసంగా ప్రవర్తించి దళిత మహిళను మరియమ్మను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుమారుడు ఉదరు కిరణ్ మర్మావయవాలపై విచక్షణ రహితంగా కొట్టడడం వల్ల ప్రస్తుతం ఖమ్మంలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు. తక్షణమే పోలీసులపై హత్యానేరంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి దోడ్డా రవికూమార్, టౌన్ కమిటీ సభ్యులు గూడేపూరి రాజు, మేరుగు ముత్తయ్య, కె.సత్యా, నిరంజన్ పాల్గొన్నారు.
కొత్తగూడెం : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుస్టేషన్లో లాకప్ డెత్‌కు గురైన చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన దళిత మహిళా మరియమ్మ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా తక్షణమే ప్రకటించి హత్యకు పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బస్‌స్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లిమాలోత్ వీరు నాయక్, సీనియర్ నాయకులు గంధం మల్లికార్జున రావు, వంగా రవిశంకర్, జెట్టి ఆనందరావు, పొన్నాల రాజయ్య, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో : దళిత మహిళ మరియమ్మ మృతికి కారకులైన వారిని శిక్షించాలని, వారికుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి పట్టణ ఐద్వా కార్యదర్శి సందకూరి లక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. పోలీసులు మరియమ్మను లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించడంతో చనిపోయిన మరియమ్మకు న్యాయం చేయాలని, దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు.