Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలి : అఖిలపక్షం
నవతెలంగాణ-మణుగూరు
సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు ఎకరానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని, 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని ఆఖిల పక్ష పార్టీల నాయకులు, భూ నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం మణుగూరు స్నేహా గార్డెన్ ఫంక్షన్హాల్లో భూ నిర్వాసిత రైతులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆఖిలఫక్ష పార్టీల నాయకులు బోల్లజ అయోధ్య చారి, కాటిబోయిన నాగేశ్వరరావు, దొడ్డి క్రిష్ణ, ఆర్.మధుసూదన్‌రెడ్డి, పున్నం భిక్షపతి, గురిజాల గోపి, గాదే కేశవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ... సంవత్సరానికి రెండు పంటలు పండే పచ్చటి పోలాలను ప్రాజెక్ట్ కోసం త్యాగం చేస్తున్నామన్నారు. ఈ భూములకు అరకొర ప్యాకేజీ ఇచ్చి రైతులను ప్రభుత్వం, అధికారులు మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఉప్పతల నర్సింహారావు, రావులపల్లి రామ్మూర్తి, లింగంపల్లి రామేష్, ఎండి. నురుద్దీన్, రైతులు కుడితిపూడి కోటేశ్వరరావు, కంజు చంద్రమోహన్, కూడిపూడి సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.