Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలని సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు డిమాండ్ చేశాయి. ఆయా పార్టీల ఆధ్వర్యంలో గురువారం చింతకాని పెట్రోల్ బంక్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) మండల పార్టీ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కొండపర్తి గోవిందరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మల్లికార్జునరావు, సీపీఐ(ఎం) నాయకులు వత్సవాయి జానకిరాములు, కృష్ణమూర్తి, రమణ, ఉపేందర్, సీతా రాములు, గంగాధర్, రవి, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని ఇప్టూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. శుక్రవారం కూనవరం రైల్వేగేట్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ. మంగీలాల్, గురుమూర్తి, వీరాజ్రు, సాంబ, సాయికుమార్, వెంకటేశ్వర్లు, వినరు నాగరాజు, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బీఎస్పీ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరసింహారావు, ఉపాధ్యక్షులు సందీప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాయిరాం తండా బీఎస్పీ పార్టీ పంచాయతీ అధ్యక్షుడు జాటోత్ విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.