Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతన ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ళ రవికుమార్
నవతెలంగాణ-బోనకల్
మానవతా దృక్పథంతో పుట్టి సేవా కార్యక్రమాలే లక్ష్యంగా చేతన ఫౌండేషన్ ముందుకు సాగుతోందని చేతన ఫౌండేషన్ చైర్మెన్ వెనిగండ్ల రవికుమార్ రేణుక దంపతులు తెలిపారు. చేతన ఫౌండేషన్ స్థాపించిన ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. వారి మాటల్లోనే... వెనిగళ్ళ రవి కుమార్ ఆంధ్రప్రదేశ్ లోనే గుంటూరు జిల్లా గుత్తవారిపాలెంలో జన్మించారు. కానీ ఆయన ఖమ్మం జిల్లా కొత్తపేట గ్రామం కావడంతో అది ఆయన తన స్వస్థలం లాగే భావిస్తున్నారు.
అందుకే చేతన ఫౌండేషన్ కార్యక్రమాలు ఇండియాలో మొట్టమొదటిగా ఖమ్మం జిల్లాలోనే ప్రారంభించినట్లు తెలిపారు. జెఎన్ఐటి చిత్రదుర్గలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2000 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా తాను, తన భార్య రేణుక, కుమారులు అనిరుద్, అన్వేష్‌తో కలిసి అమెరికా వెళ్లారు. రు.20 సంవత్సరాలుగా కుటుంబ సమేతంగా ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్లాండ్ నగరంలో స్థిరపడ్డారు. వారి ఇరువురు కుమారులు ఫీనిక్స్, బోస్టన్ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ఆయన భార్య కొందరు మిత్రుల సహకారంతో డిసెంబర్, 2016 చేతన ఫౌండేషన్ స్థాపించారు. చేతన ఫౌండేషన్ ఆయన దార్శనికత, మానవతా దృక్పధాల నుండి పుట్టింది. కుల, మత, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా మానవత్వమే విలువలుగా నాలుగు సంవత్సరాల నుంచి అమెరికా, ఇండియాలో అనేక చోట్ల చేతన ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తరించుకుంటూ వస్తున్నారు. నేడు చేతన ఫౌండేషన్ తరపున వేలాది మంది అనాథలు, నిరాశ్రయులు, డ్రగ్స్ బారిన పడ్డవారు. దివ్యాంగులు, చదువుకోదలచిన చిన్నారులు తమ కలలను సాకారం చేసుకోగలుగుతున్నారు. ఇందులో ఎంతోమంది ప్రవాస భారతీయులు తాము స్వచ్ఛందంగా పాల్గొనటమే కాకుండా తమ పిల్లలని సైతం పాల్గొనేలా ఉత్సాహపరుస్తున్నారు. ఎంతో మంది దాతల సహకారంతో చేతన ఫౌండేషన్ అభాగ్యులకు, పేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఫౌండేషన్ తరపున కృత్రిమ అవయవాలు, చక్రాల సైకిళ్ళు, కుట్టు మిషన్లు, అనాథలకు పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, పరీక్షలకు కావాల్సిన వస్తువులు, డిజిటల్ తరగతులు, రక్షిత మంచినీటి ప్లాంట్, మొక్కల నాటడం, ప్లాస్టిక్ రహిత సమాజం గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో రవికుమార్ మిత్రులు కృషి కూడా ఎంతో ఉంది. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం బోనకల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కరోనా వ్యాధి నుంచి ప్రజలను కాపాడేందుకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ద్వారా అందజేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో గల దివ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు కరోనా కాలంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. బోనకల్ మండలం నుంచి సుమారు 20 మంది యువకులను చేతన ఫౌండేషన్ లో సభ్యులుగా చేర్చుకొని వారి ద్వారా మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన సూర్యదేవర వంశీ చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాడు. ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా తమ సంస్థ ఆధ్వర్యంలో చేపడతామని సంస్థ కార్యదర్శి పసుమర్తి రంగారావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పసుమర్తి రంగారావు ఆధ్వర్యంలోనే చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి.