Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మండల పరిషత్ సర్వ సభ్య సమావేశానికి కోరం లేకపోవడంతో సోమవారం నాటికి వాయిదా వేసినట్లు ఎంపీపీ వేల్పుల పావని ప్రకటించారు. మండలంలో నిర్వహించ వలసిన పల్లెప్రగతి, హరితహారం, వైకుంఠ ధామాల నిర్మాణం, వ్యవసాయ సమస్యలపై సీరియస్ గా చర్చించాల్సిన సమావేశం ఎంపీటీసీ సభ్యుల కోరం పూర్తి కాక పోవటంతో వాయిదా వేశారు. మండలంలో 10 మంది ఎంపీటీసీ సభ్యులు ఒక కో ఆప్షన్ సభ్యులు సమావేశానికి హాజరు కావలసి ఉండగా ఎంపీపీతో కలిపి ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. మొత్తం 22 మంది సర్పంచు లు ఉండగా సమావేశానికి 11 మంది హాజరయ్యారు. సమావేశ నిబంధనల ప్రకారం ఎంపీటీసీల సంఖ్య మాత్రమే ప్రామాణికంగా ఉంటుంది. అందువలన సోమవారానికి వాయిదా వేశారు. సమావేశంలో ఎంపిడిఓ ఎన్ వెంకట పతి రాజు, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహమ్మద్ పాల్గొన్నారు.సమావేశం ముగిసిన అనంతరం సర్పంచ్ లు, ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీటీసీలను ప్రజాప్రతినిధులగా చూస్తే సమావేశాలకు వస్తారని, రెండున్నర ఏళ్లు గడిచినా గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ ద్వారా ఒక్క రూపాయి ఇవ్వక ఉత్సవిగ్రహాలుగా నిలిపి ప్రజల్లో పనికి రాని వాళ్ళను చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలకు రావాలన్న ఉత్సుకత ఎలా ఉంటుందని అన్నారు. గౌరవ వేతనాలు పెంచినట్లు ప్రకటించగా ప్రజల్లో అది చులకన బావనే కలిగిస్తుందని అన్నారు.