Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ తీరుమారేవరకూ ఆందోళనలు
- వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ-ఖమ్మం
సాగుచట్టాలలో తీసుకొచ్చిన సంస్కరణలను ఉపసంహరించుకోవాలని, చట్టాల ఉపసంహరణ సాగేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని వామపక్షాల నేతలు తెలిపారు. దేశవ్యాపితంగా ఆరు నెలలుగా రైతాంగం వివిధ పద్ధతులను ఆందోళనలను నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. శనివారం సీపీఐ(ఎం), సీపీఐ, సిపిఐ ఎం.ఎల్. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్మించారు. ఈ ఆందోళనను ఉద్దేశించి వామపక్షాల నేతలు యర్రా శ్రీకాంత్, బాగం హేమంతరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయరంగం ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిందని నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకు వస్తే వ్యవసాయ రంగం ఒక సంక్లిష్టస్థితి ఎదుర్కొనున్నదని తెలిపారు. కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పగించి రైతులను కూలీలుగా మార్చే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందని దీనిని ఎదుర్కొంటామని వారు స్పష్టం చేశారు. అత్యవసర వస్తువుల సవరణ చట్టం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, పూర్తిచట్టం అమల్లోకివస్తే సామాన్యులకు నిత్యవసరవస్తువులు అందని ద్రాక్షే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మాదినేని రమేష్, తాత భాస్కర్, యర్రా శ్రీనివాసరావు, వై. విక్రమ్, బహీర్, లింగయ్య, మాచర్ల భారతి, రమ, అమరావతి, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా కార్యవర్గసభ్యులు జమ్ముల జింతేందర్రెడ్డి, శింగు నర్సింహారావు, ఎస్.కె. జానిమియా, బి.జి. క్లెమెంట్, పోటు కళావతి, ఎం.ఎల్. న్యూడెమోక్రసీ నాయకులు సి.వై. పుల్లయ్య, సి.హెచ్. శిరోమణి జి. మస్తాన్, టి.లక్ష్మణ్, మామిడాల వెంకటేష్, ఆర్. క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఆనాటి ఎమర్జెన్సీ పాలన దిశగా మోడీ సర్కార్
ఎర్రుపాలెం : ఆనాటి ఇందిరాగాంధీ కాలంలో ఎమర్జెన్సీ పాలన దిశగా మోడీ సర్కార్ పయనిస్తోందని, అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దేశద్రోహం, రాజద్రోహం, నేరాలు మోపి జైలుపాలు చేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మోడీ సర్కార్‌ని ఘాటుగా విమర్శించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రింగ్ సెంటర్లో పార్టీ అనుబంధ సంఘాలయిన రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయుల పిలుపుమేరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జూన్ 26వ తేదీ అనేక విధాల విశిష్టత కలిగి ఉన్నదని 46 సంవత్సరాల క్రితం దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన చీకటి రోజని, 7 నెలల క్రితం ఇదే రోజు నవంబర్ 26వ తేదీ రైతాంగ ఉద్యమం ఢిల్లీ ముట్టడి ఆరంభమైన రోజు అని ఈసారి జూన్ 26 నిరసన దినం పాటించాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయని ఆయన తెలిపారు. ఆ పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మందడ కృష్ణారావు, పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, గామాసు జోగయ్య, నాగులవంచ వెంకట్రామయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు, నల్లబోతుల హనుమంతరావు, ఆంగోతు వెంకటేశ్వర్లు, జార్జి టెన్నిసన్, పెరుమాళ్ళ వెంకట్రామయ్య, కోటి సుబ్బారెడ్డి, లగడపాటి అప్పారావు, మాదల వెంకట నరసయ్య, షేక్ బాబు, ఆవుల వెంకటేశ్వర్లు, శ్యామల్రావు, కోటియా, తదితరులు పాల్గొన్నారు.
వైరా టౌన్ : రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26 నుంచి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో రైతులు జరుపుతున్న ఉద్యమం 7 నెలల పూర్తి అవుతున సందర్భంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వైరా అంబేడ్కర్ విగ్రహం వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో సేవ్ అగ్రికల్చర్, సేవ్ డెమోక్రసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలు ప్రయోజనాల కోసం చిన్న చిన్న ఉత్పత్తి దారులుగా ఉన్న రైతులను వ్యవసాయంకు దూరం చేస్తాయని, వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సమితి నాయకులు యామాల గోపాలరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొంతు సమత, సీనియర్ నాయకులు నర్వనేని సత్యనారాయణ, వైరా మండల అధ్యక్ష, కార్యదర్శులు వనమా చిన్న సత్యనారాయణ, నల్లమోతు వెంకటనారాయణ, వైరా పట్టణ అద్యక్ష, కార్యదర్శులు పైడిపల్లి సాంబశివరావు, చింతనిప్పు చలపతిరావు, రైతు సంఘం నాయకులు ఆళ్ళ రాంబాబు, సీఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, కురగుంట్ల శ్రీనివాసరావు, గుడిమెట్ల రజిత, కరీమ్ఉల్ల, పారుపల్లి కృష్ణారావు, గుడిమెట్ల మెహనరావు, ఎస్.కె మజీద్, యనమద్ది రామకృష్ణ, తోట పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
చింతకాని : సేవ్ ఇండియా.... సేవ్ అగ్రికల్చర్ పేరుతో ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సవరణ బిల్లులను తెచ్చిందని 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్పు చేసిందని వీటిని వెనక్కి తీసుకోవాలన్నారు. 200 రోజులుగా కార్మిక కర్షక ఐక్య ఉద్యమం జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. రైతాంగ ఉద్యమం పై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. ప్రశ్నించే వారిపై దేశ ద్రోహం రాజద్రోహం కేసు లను బనాయిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలన్నారు. అనంతరం రైతు సమస్యలపై డిప్యుటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వత్సవాయి జానకి రాములు, రైతు సంఘం మండల కార్యదర్శి బల్లి చిన్న వీరయ్య, నాయకులు తోటకూర వెంకట నరసయ్య, నన్న కృష్ణమూర్తి, తిరుపతి, అంజయ్య, శ్యాంసుందర్, కిరణ్ బాబు పాల్గొన్నారు.
ముదిగొండ : ప్రజాసమస్యలపై నిరంతరం పోరు చేసేది సీపీఐ(ఎం)పార్టీనని ఆ పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల పరిధిలో బాణాపురం, వనంవారికిష్టాపురం, చిరుమర్రి, ముదిగొండలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు బట్ట పురుషోత్తం, మంకెన దామోదర్, పయ్యావుల ప్రభావతి, పుల్లయ్య, కెవిపిఎస్ మండల కార్యదర్శి కట్టకూరు ఉపేందర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, కృష్ణసాగరపు సత్యం, డీవైఎఫ్ఐ నాయకులు బండి శ్రీను, నల్లగొండ ఎల్లేష్, సీఐటియు మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్, రైతుసంఘం మండల కార్యదర్శి కొల్లేటి ఉపేందర్, నాయకులు పోలూరి నరసింహారావు పి రాంబాబు సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు, నాయకులు మర్లపాటి కోటేశ్వరరావు, సామినేని రామారావు తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
సత్తుపల్లి రూరల్ : రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐకెఎస్‌సిసి ఇచ్చిన పిలుపులో భాగంగా సత్తుపల్లి మండలం గంగారం సెంటర్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం జరిగింది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమం లో ప్రజా సంఘాల నాయుకులు కావూరి వెంకటేశ్వరావు, కువ్వారపు లక్ష్మణరావు, హాసవత్ కృష్ట, కాకాని శ్రీనివాసరావు, గుంటూరు జయరాజు, మద్దిశెట్టి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన దేశ వ్యాప్త పిలుపులో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ప్రజాస్వామ్యాన్ని రక్షించండి-వ్యవసాయ రంగాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని పరిరక్షించండి అనే నినాదంతో ఖమ్మం రూరల్ మండలంలో అంబేద్కర్ విగ్రహం ఉన్న తెల్దారుపల్లి, ఆరేంపుల, మద్దులపల్లి, తల్లంపాడు, పొన్నెకల్లు, చింతపల్లి గ్రామాలలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల శ్రీనివాసరావు, పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యులు పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, బందెల వెంకయ్య, పొన్నెకంటి సంగయ్య, నందిగామ కృష్ణ, మండల కమిటీ సభ్యులు మేడికొండ నాగేశ్వరరావు, పల్లె శ్రీనివాసరావు, చావా నాగేశ్వరరావు, పుచ్చకాయల నాగేశ్వరరావు, శాఖా కార్యదర్శులు వల్లూరి సీతారామ రెడ్డి, పెంట్యాల నాగేశ్వరరావు,సాల్వే వెంకటేశ్వర్లు,ఏటుకూరి ప్రసాద్, బండి ప్రకాష్ రావు, గుండె తిరపయ్య, గోపి,గడ్డం వెంకటయ్య, పాల్గొన్నారు.
కారేపల్లి : కార్మిక, కర్షక మైత్రితో కేంద్రరాష్ట్ర పాలకుల ప్రజావ్యతిరేక చట్టాలపై పోరాటం చేయనున్నట్లు వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి కే.నరేంద్రలు అన్నారు. శనివారం కారేపల్లి మండలంలోని పాటిమీదిగుంపు, మాణిక్యారం గ్రామాల్లో సేవ్ అగ్రికల్చర్-సేవ్ డెమోక్రసీ నినాదంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీలో కుల విభజన వ్యతిరేకించాలని ప్లకార్డులతో రైతులు, వ్యవసాయ కార్మికులు నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కరపటి సీతారాములు, దారావత్ సైదులు, కరపటి రాంబాయి, కే.ఉమావతి, సూరబాక సర్వయ్య, బానోత్ బావుసింగ్, పాతర్ల నాగేశ్వరరావు, మల్లేష్, రాములు, పాల్గొన్నారు.