Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఇంటికీ 6 మొక్కలు
- పల్లె ప్రగతి, హరితహారంపై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష
- పాల్గొన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం శనివారం ముగిసింది. ఈ సమీక్షా సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ఆర్వీ.కర్ణణ్, అనుదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జులై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. నిర్దేశించిన ఏపనీ పెండింగ్లో ఉండేందుకు వీలులేకుండా చూడాలన్నారు. పనులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సమీక్ష చేసుకోవాలని ఆదేశిం చారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇచ్చి నాటించా లన్నారు. ఎన్నడూ లేని విధంగా పంటలతో రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు అవసరం ఉందన్నారు. రైస్ మిల్లుల సంఖ్యను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రు లు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్లు, డీ ఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, పంచాయ తీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు హాజరయ్యారు.