Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితరాలివి అంటూ పెండ్లికి నిరాకరణ
- ప్రియుడితో పెళ్లి....లేదా చావు
- ప్రియురాలు సింధు
నవతెలంగాణ-బోనకల్
పెండ్లికి నిరాకరించడంతో మరల ప్రియుడి ఇంటి ముందు శనివారం రాత్రి దీక్షకు ప్రియురాలు దిగింది. ఈ నెల 24వ తేదీన ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగటంతో ఎస్ఐ బి కొండలరావు సంఘటన స్థలానికి పోలీసులను పంపించి న్యాయం చేస్తానని హామీతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. రెండు రోజుల నుంచి ఎస్ఐ ప్రియుడికి కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం దక్కలేదు. మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన ప్రియుడు పరసగాని వేణు ఎస్సై నిర్వహించిన కౌన్సిలింగ్లో కూడా పెళ్లికి నిరాకరించాడు. అదేవిధంగా ప్రియుడు తల్లిదండ్రులతో కూడా రెండు రోజులపాటు కౌన్సెలింగ్ నిర్వహించినా సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమయ్యింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపంతో పారా సింధు తనకు ఆత్మహత్య శరణ్యమని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దీంతో ఆమె బంధువులు, స్థానికులు కాపాడారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ దళితరాలువి అంటూ పెళ్లికి నిరాకరిస్తున్నారని బోరున విలపిస్తూ తెలిపింది. వేణు తోనే పెళ్లి జరగాలని లేకపోతే అతని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంటానని నాకు మరో మార్గం లేదని బోరున విలపిస్తూ స్పష్టం చేసింది. దీంతో కథ రసవత్తరంగా మారింది. నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమ ,పెళ్లి అంటూ తనను తనతో తిప్పుకొని నేడు కులం పేరుతో తనను పెళ్లి చేసుకోవటానికి నిరాకరిస్తున్నారని తెలిపింది. మీడియా మిత్రులు తనకు న్యాయం జరిగేందుకు సహకరించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వేడుకుంది. రెండు రోజులుగా భోజనం లేకపోవడంతో శనివారం రాత్రి సొమ్మసిల్లి పడిపోయింది.