Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
నవతెలంగాణ- కూసుమంచి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో ప్రతి పల్లె అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీిఆర్ ఆదేశాలనుసారం పాలేరు నియోజకవర్గంలోని ప్రతి పల్లె అభివృద్ధి చెందే విధంగా కృషి చేయడమే నా ధ్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసాని సైదులు, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, డిసిసిబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మా వీరారెడ్డి, మాజీ సర్పంచ్ వీరారెడ్డి, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించిన
ఎమ్మెల్యే కందాళ...
జీళ్ళచెరువు గ్రామంలో ఇటీవల మరణించిన మద్దెల నర్సమ్మ, కత్తి కృష్ణ, కుటుంబాలకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి విషయం తెలియజేయగా శనివారం రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ద్వారా అందజేశారు.