Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖానాపురం హవేలి సీపీఐ(ఎం) ఆధ్యర్యంలో పెట్రోల్ రేట్లు తగ్గించాలని వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచారాని ఒక్క పక్క కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రేట్లు పెంచడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం హవేలి కార్యదర్శి దొంగల తిరుపతి రావు, మండల కమిటీ సభ్యులు తమ్మినేని వెంకటేశ్వర్లు, దంతలా కేశవులు, పోతురాజు వెంకటి, సత్తెనపల్లి శ్రీను, తిప్పర్తి నరసింహ రావు, దంతలా నరసింహ, తాత తిలక్ నాద్, కత్తుల అమరావతి, పిన్నింటి రమ్య, పి నాగమణి, నెల్లూట్ల వెంకన్న, తోట నాగరాజు, నాయకులు వేదగిరి మురహరి, తోట వెంకన్న,కే నవీన్, యస్ హనుమంతరావు, మహేష్, కే.పవన్, మహేష్, కే వేంకటేశ్వలు, బి వెంకటేశ్వర్లు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు.