Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు బానోత్ ఊక్లా, సీపీఐ మండల కార్యదర్శి గుగులోత్ రాంచందర్, న్యూ డెమోక్రసీ మండల నాయకులు ధర్మపురి వీరబ్రహ్మచారిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తహసీల్దార్ కె.వి. శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తేజావత్ లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి అంటూ సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్డీ నాయకులు తల్లాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు అయినాల రామలింగేశ్వర రావు, గుంటుపల్లి వెంకటయ్య, షేక్ లాల్ మియా, మోహన్ రావు, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రజాస్వామిక నూతన చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన రైతు ఉద్యమానికి మద్దతుగా సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కె.పుల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిట్టల అర్జున్, చిరంజీవి, జగన్నాధం, షణ్ముఖి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.