Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడ్డ బాధితునికి ఆర్థిక సాయం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంకు సమీపంలో గల ఎటపాక మండలం రాయని పేట గ్రామానికి చెందిన భఛ్చలకురి రాజేష్ (34) రాయని పేట వద్ద యాక్సిడెంట్ జరిగి తీవ్ర గాయాలయ్యాయి. మొదట భద్రాచలం తదుపరి గుంటూరులో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మెదడుకి చికిత్స చేయడంతో ఆర్థిక అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం అప్పులు చేసి అతడిని బతికించుకున్నారు. కొన్ని నెలలు మంచానికి పరిమితమైయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మీడియా మిత్రులు ద్వారా తెలుసుకున్న జేడీ ఫౌండేషన్ భాద్యుడు మురళీ మోహన్ కుమార్ శనివారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాయని పేట గ్రామానికి వెళ్లి ఆ కుటుంబాన్నిని రూ.8వేల నగదుని తక్షణ సాయంగా అందజేశారు. రాజేష్ భార్యకి ఫౌండేషన్ సభ్యులు హన్సి, పవన్ కుమార్, ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ సోదరి కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్న తమకు తాము ఉన్నామని ముందుకు వచ్చి కొండంత ధైర్యాన్ని అందించిన జేడీ ఫౌండేషన్‌కి ఎప్పుడు రుణపడి ఉంటామని పేర్కొన్నారు