Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సిషేదిత సీపీఐ మావోయిస్టు పార్టీ మణుగూరు ఏరియా కమిటీ సభ్యులు, దళ సభ్యురాలు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. మణుగూరు ఏరియా ఎల్ఓఎస్ ఏరియా కమిటీ సభ్యుడు మడివి ఇడుమ, అలియాస్ సురేందర్, దళ సభ్యురాలు మడకం బుద్రి అలియాస్ సోని జిల్లా పోలీసుల ఎదుల లొంగిపోయారని తెలిపారు. మడివి ఇడుమ నిషేదిత సీపీఐ మావోయిస్ట్ పార్టీలో ముఖ్య పాత్ర పోషించాడని తెలిపారు. పార్టీ స్టేట్ కమిటీ మెంబర్‌గా, జిల్లా రీజినల్ కార్యదర్శి అజాద్‌కు గార్డుగా పనిచేశాడని తెలిపారు. 2018 నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడన్నారు. మడకం బుద్రి అలియాస్ సోని, మణుగూరు ఎల్ఓఎస్ సభ్యురాలు కూడా ఆజాద్‌కు గార్డుగా పనిచేసినట్లు తెలిపారు. ఆమె 2016 నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తోంది. మే 2021లో ఆమె సురేందర్‌ను వివాహం చేసుకుందన్నారు. మావోయిస్టు పార్టీ నాయకత్వం వేధింపులు, మావోయిస్టు పార్టీ క్యాడర్లో కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో పోలీసుల ఎదుల లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు పోలీసుల ముందు లొంగిపోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రోత్సాహాకాలు అందజేశారు. ఓఎస్డీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.