Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకానొక దశలో మృతి చెందినట్టు సమాచారం
- మావోయిస్టు నేత హరిభూషణ్ కుటుంబంలో మరో విషాదం?
- ప్రస్తుత పరిణామంపై నోరుమెదపని అరణ్య గ్రామాలు
- దండకారణ్యాన్ని కలియతిరిగిన పాత్రికేయ బృందం
నవతెలంగాణ-చర్ల
చర్ల శబరి ఏరియా కమిటీ ఇన్చార్జి, భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి జిల్లాల సెక్రెటరీ జెజ్జరి సమ్మక్క అలియాస్ శారదక్క తీవ్ర అస్వస్థతకు గురి అయినట్టు ఒకానొక దశలో ఆమె మృత్యువాతపడ్డట్టు కథనాలు ఇటు తెలంగాణ, అటు చత్తీస్ఘడ్ ప్రధాన టీవీ ఛానళ్లలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో చర్ల పాత్రికేయం బృందం దండకారణ్యంలో ఆదివాసీలు గ్రామాల పర్యవేక్షించింది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత యాప నారాయణ అలియాస్ హరిభూషన్ చనిపోయిన నాలుగవ రోజే ఆయన సహచరి జెజ్జరి సమ్మక్క అలియాస్ శారదక్క 24వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్టు సమాచారం కాగా పచ్చని అడవుల్లో కరోనా విషం చిమ్మడంతో రాష్ట్ర కార్యదర్శి హరి భూషణ్ ఇరవై ఒకటో తారీఖున మృతిచెందగా, 22వ తారీఖున భారతక్క సైతం కరోనా మహమ్మారికి బలైన సంగతి పాఠకులకు విదితమే. అయితే కరోనా దండకారణ్యంలో రోజురోజుకు విజృంభించడంతో మావోయిస్టు క్యాడర్ కోవిడ్-19 బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలో శారదక్కకు కరోనా వచ్చి తీవ్ర అస్వస్థత గురై వైద్య సేవలు అందుకుంటూనే మృతి చెందినట్టు సమాచారం నెలకొంది. కానీ దండకారణ్యంలోని పామేడు, యాంపురం గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఆదివాసి గ్రామాలలో గల ఆదివాసీలను సమాచారం కోరగా అటువంటి సమాచారం లేదని ఆదివాసీలు నోరు మెదపకపోవడం ఆమె మృతి చెందారా.. జీవించి ఉన్నారా అనే ఉదాంతం అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఆమె ఆరోగ్య స్థితిపై ఇప్పటివరకు మావోయిస్టులు ఎటువంటి ప్రకటన చేయకపోవడం వేర్వేరు అనుమానాలకు తావు తీస్తుంది.