Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.5 లక్షల రివార్డు గల మావోయిస్టు మృతి
- 9 ఎమ్ఎమ్ పిస్టల్ స్వాధీనం
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్గడ్ దంతేవాడ దండకారణ్యంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల్లో రూ.5 లక్షల రివార్డు గల మార్కం సంతోష్ మృతి చెందాడు. అతనిపై 25కి పైగా నేరాలు నమోదయ్యాయని, దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. వారి వివరాల ప్రకారం... దంతేవాడ జిల్లా మలంగీర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చురుకైన మావోయిస్టు సంతోష్ మార్కమ్ అనుచరులతో సమావేశమైన సంగతి తెలుసుకొని డీఆర్జీ బలగాలు కూబింగ్ నిర్వహించాయని ఎస్పీ తెలిపారు. మృతుడు సంతోష్‌పై దంతేవాడ పోలీసులు రూ.5 లక్షల రివార్డు విధించారు. డీఆర్జీ బృందంతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడని వివరించారు. అతని నుంచి 9 ఎంఎం పిస్టల్‌తో సహా మృతదేహం స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.