Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందజేత
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అమరజీవి యలమంచి సీతారామయ్య పేరిట ఏర్పాటు చేసిన వైఎస్ ట్రస్టు కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తోంది. కరోనా సోకిన ప్రతి కుటుంబానికి నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి మేమున్నాం అధైర్య పడకండి అంటూ వారికి భరోసా కల్పించడంతో పాటు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు, గుడ్లు వంటివి అందజేస్తూ అపన్నహస్తం అందిస్తోంది. అందులో భాగంగా ఆదివారం కాశీనగరం, జిన్నెలగూడెం గ్రామాలలో కరోనా పాజిటివ్ నమోదు అయిన 50 మంది బాదిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు, గుడ్లను సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో అందజేశారు. మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొర్సా చిలకమ్మ, యలమంచి వంశీకృష్ణ, చిన్ననల్లబల్లి సర్పంచ్ మిడియం జయమ్మ, మాజీ ఎంపీటీసీ పూసం శిలువకుమార్, దుమ్ముగూడెం సొసైటీ డైరెక్టర్ యలమంచి శ్రీను బాబు, కాశీనగరం ఉపసర్పంచ్ గడ్డం సతీష్, నాయకులు తెల్లం ధర్మయ్య, మిడియం సీతయ్య, నానిబాబు, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.