Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
కోవిడ్ బారిన పడిన వారి ఆకలి తీరుస్తూ...వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్న భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ సేవలు శ్లాఘనీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఉద్యోగి బండి రాజేష్ జ్ఞాపకార్థం 31వ రోజు ముగింపు రోజు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తగూడెంలో గత కొన్ని రోజులుగా కరోనా సోకి ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న పేద కరోనా బాధిత కుటుంబాలకు ఆకలి తీరుస్తూ వారి కుటుంబాలలో ఆత్మస్థైర్యాన్ని నింపిన భద్రాద్రి హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ సేవలు చాల గొప్పవని కొనియా డారు. షేక్ దస్త గిరి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాద్రి హెల్పింగ్ హ్యాండ్ చైర్మన్ సంగం వెంకట పుల్లయ్య, వైస్ చైర్మెన్ కోడుమూరు శ్రీనివాస్, బాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లగడపాటి రమేష్ చంద్, ముఖ్య ప్రధాన కార్యదర్శి సతీష్ గుండపునేని, కోశాధికారి విజయలక్ష్మి, అన్నదాత ప్రొఫెసర్ రంజిత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.