Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంలగాణ-భద్రాచలం
భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షులుగా ఎనుముల రేవంత్ రెడ్డి నియామకం పట్ల భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పీసీసీ ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, భద్రాచలం ఎమ్మె ల్యే పొదెం వీరయ్యలను నియమించటం చాలా ఆనందించ దగ్గ విషయం అని అన్నారు. ఈ కార్య క్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బోలిశెట్టి రంగారావు, జిల్లా సీనియర్ నాయకులు చింతిర్యేల రవికుమార్, బోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నరసింహారావు, రమేష్, సాయిబాబా పాల్గొన్నారు.
చండ్రుగొండ : పీసీసీగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించడంతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఆదివారం మండల పరిధిలోని మద్దుకూరు గ్రామంలో మండల సీనియర్ నాయకులు నల్లమోతు రమణ, చుండ్రు విజరు, సర్పంచ్ పద్దం వినోద్, ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మండల కేంద్రములోని ప్రధాన సెంటర్ లో మండల పార్టీ అధ్యక్షుడు సాబీర్ హుస్సేన్ జడ్పీటీసీ కొడకండ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధరావత్ రామారావు, హరిలాల్, నరసింహారావు, సురేష్, నర్సింహారావు, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారధిగా రేవంత్ రెడ్డి నియమితులైన సందర్భంగా బూర్గంపాడు కాంగ్రెస్ నాయకులు భజన సతీష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం, కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బర్ల నాగమణి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారం వెంకటేశ్వరరెడ్డి, పినపాక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంద నాగరాజు, పిచ్చిరెడ్డి, సురేష్, వెంకటనారాయణ, రవీందర్ రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల కార్యకర్తలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీని నాయకులు వడ్డేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పినపాక : మండలంలోని ఈ.బయ్యారం క్రాస్‌రోడ్ కాంగ్రెస్ కార్యాలయంలో మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు టీపీసీసీగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్యని నియ మించిన సందర్బంగా సోనియా గాంధీ, రాహుల్ గాం ధీకి ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్య క్రమంలోమండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కరకగూడెం : మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు టిపీసీసీగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా భద్రాచలం శాసనసభ్యులు పోదెంవీరయ్యని నియమించిన సందర్భంగా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, రామనాధం, నాగేశ్వరరావు, నాగబండి వేంకటేశ్వర్లు, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం: రేవంత్ రెడ్డి ఎంపిక పట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ రావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలకు ఉపాద్యక్షులుగా నియమం చినందుకు ధన్యవాదాలు తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంకా శ్రీనివాసరావు (అబ్బులు) సీనియర్ నాయకులు బైరెడ్డి సీతారామారావు, పిలకా వెంకటరమణారెడ్డి, శీరపు అప్పలరెడ్డి,సాంబశివరావు తదితరులు ఉన్నారు.
పాల్వంచ: రేవంత్‌రెడ్డి నియామకాన్ని హర్షిస్తూ పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాద్యక్షులు పూనెం అనుదీప్ ఆధ్వర్యంలో ఆదివారం పాల్వంచలో బైకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్కె షఫీ, బానుతేజ, రేవంత్ సైన్యం, ఎస్కె అమీర్, కాపా శ్రీను, ఎస్కె చాంద్‌పాషా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు: తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డి ఎన్నికైనందుకు మణుగూరు సబ్ డివిజన్లో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం కాంగ్రెస్‌లో వున్నటువంటి గ్రూప్ రాజకీయాలను పక్కనపెట్టి అందరు ఆటో, మోటర్ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలమూరి రాజు ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో టపాసులు పెల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...సోనియా గాంధీ ఆశయం నేరవేరేందుకు బంగారు తెలంగాణ సాధించేందుకు రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చాన్నారు. జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్యకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. పోరిక బాలరామ్ నాయక్, పొదెం వీరయ్య నాయకత్వంలో పినపాక నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుటుందన్నారు. ఈ కార్యక్రమంలో కుర్రం రవి, వీరన్న, రషీద్, బుర్గుల నర్సయ్య, నల్లగట్ల ప్రవీణ్, ఎండి హారిఫ్ పాషా, శ్యామ్, భాస్కర్, ప్రవీణ్, బీరం సుధాకర్‌రెడ్డి, పిరినాకి నవీన్, ముక్కెర లక్ష్మణ్, గోళ్ల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి : మండల కేంద్రం కూడలి రాజీవ్ చౌక్ నందు కూసుమంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి ఎన్నిక పట్ల మండల నాయకులు కేక్ కటింగ్ చేసి, బాణా సంచా కాల్చారు. ఈ సందర్భంగా మండల సీనియర్ నాయ కులు హాఫిజ్ మాట్లాడారు.
ఈ కమిటీలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించిన సంబాని చంద్ర శేఖర్, సీనియర్ ఉప అధ్యక్షుడుగా నియమించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మండల నాయకులు కోటి దామళ్ళ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనటానికి ప్రకటించిన పీసీసీ కమిటీ నిదర్శనం అని తెలిపారు. అదే విధంగా యువజన కాంగ్రెస్ నాయకులు బెల్లంకొండ శరత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుండా భూపాల్ రెడ్డి, నెల్లూరి రవి, బెల్లంకొండ కిరణ్ తదిరుతు పాల్గొన్నారు.