Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు అ ఎన్డీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి చేపడుతున్న ఓసీలు పట్టణాలు, పల్లెల అభివృద్ధికి విఘాతమని ఎన్డీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అన్నారు. న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పాత రోంపేడులో ఆదివారం జరిగిన జరిగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని మధు పిలుపునిచ్చారు. పూస పల్లి మెగా ఓసిని వ్యతిరేకిస్తూ సింగరేణి పుట్టినిల్లు అయిన బొగ్గుట్ట అండర్ గ్రౌండ్ బావులు కొనసాగినంత కాలం వేలాది మంది కార్మికులకు, ఉద్యోగులకు, ఉపాధి కల్పించిందని అన్నారు. నేటి పాలకులు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ఓపెన్ కాస్ట్లను అప్పగించి బొందల గడ్డగా మారుస్తున్నారని విమర్శించారు. రోంపేడు సర్పంచ్ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎన్డీ డివిజన్ సహాయ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, ఐఎఫ్టియు ఇల్లెందు ఏరియా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావుకు, సారంగపాణి, మాణిక్యరావు, సర్పంచ్ మోకాళ్ళ కృష్ణ పాల్గొన్నారు.