Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను విసిగిస్తూ, నిరుత్సాహానికి గురి చేసిన హైకమాండ్ ఎట్టకేలకు రేవంత్ రెడీని టిపిసిసి అధ్యక్షుడిగా నియమించి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. నియోజక వర్గ కేంద్రమైన వైరాలో ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కట్లా రంగారావు నాయకత్వంలో ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుండి ప్రదర్శనగా క్రాస్ రోడ్డుకు చేరుకుని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు అభిమానులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులుగా నియమితులు కావటం మంచి పరిణామమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ, చైతన్య పరుస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్ని సామాజిక వర్గాల అభిమానం చూరగొని అధికారం చేపట్టటం లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎదునురి శ్రీను, డి కృష్ణ, లక్ష్మీపురం ఉపసర్పంచ్ మల్లు రామకృష్ణ, వెంపటి రంగారావు, రేచర్ల నాగేశ్వర రావు, కట్లా నాగరాజు, సంతోష్, యామాల భాస్కరరావు న్యాయవాది కట్లా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి నియామకంపట్ల హర్షం
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షునిగా మల్కాజ్ గిరి ఎంపీ అనుమల రేవంత్ రెడ్డి నియామకంపై మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హర్షం వెలిబుచ్చారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచి పెట్టి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు నరసింహారావు, కడియం శ్రీనివాసరావు, షేక్ ఇస్మాయిల్, కంచర్ల వెంకట నరసయ్య, శీలం శ్రీనివాసరెడ్డి, బూసి పల్లి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
నవతెలంగాణ-కామేపల్లి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునిగా మల్కాజ్ గిరి ఎంపీ అనుమల.రేవంత్ రెడ్డిని, రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులుగా నియమించడం పట్ల కామేపల్లి మండల కాంగ్రెస్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. మండల కమిటీ ఆధ్వర్యంలో కామేపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచి పెట్టి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల.నర్సిరెడ్డి, జెడ్పీటీసీ బాణోతు.వెంకట ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య పాల్గొన్నారు.
సత్తుపల్లి : రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆదివారం సత్తుపల్లిలోని రింగు సెంటరులో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరిపారు. ఆసుపత్రిలోని బాలింతలకు, ఐసోలేషన్ సెంటరులోని కరోనా బాధితులకు స్వీట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పింగుల సామేల్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్, కాలం కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి రామిశెట్టి సుబ్బారావు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రషీద్, మానుకోట ప్రసాద్, నరకుళ్ల సత్యం, నాగళ్ల రామారావు, మైనారిటీ నాయకులు ఎండీ బాబా, ఎండీ సమద్, మాగంటి సతీశ్, గుదే రాము, పిచ్చిరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దార్ల సురేశ్, నేరేటి ఆనందరావు, మహేశ్, మురళి, చల్లగుండ్ల రవి పాల్గొన్నారు.
కారేపల్లి : తెలంగాణ ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రేవంత్రెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం కారేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలను జరుపుకున్నారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్, సినిమాహాల్ సెంటర్ లలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలను పంచారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కారేపల్లిలో మోటర్ సైకిల్ ర్యాలీని జరిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పగడాల మంజుల, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తలారి చంద్రప్రకాశ్, సొసైటీ డైరక్టర్ బానోత్ హీరాలాల్, మాజీ సర్పంచ్ దారావత్ భద్రునాయక్, మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటేశ్వర్లు, నాయకులు సురేందర్ మనియార్, వాంకుడోత్ గోపాల్, మేదరిపాల్గొన్నారు.
తల్లాడ : పీసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం, ఉపాధ్యక్షునిగా సంభాని చంద్రశేఖర్ నియామకం పట్ల తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాప సుధాకర్, దగ్గుల రఘుపతి రెడ్డి, దీవెన కృష్ణయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆద్వర్యంలో లో సంబరాలు
కూసుమంచి : మండల కేంద్రం కూడలి రాజీవ్ చౌక్ నందు కూసుమంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని, సీనియర్ ఉపాధ్యక్షుడిగా సంబాని చంద్రశేఖర్లను నియమించిన సందర్భంగా కూసుమంచి గ్రామ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు హాఫిజ్, గుండా భూపాల్ రెడ్డి, నెల్లూరి రవి, బెల్లంకొండ కిరణ్, దామల్ల కోటి, వడిత్య సైదులు నాయక్, నాగయ్య, పాల్గొన్నారు.