Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరా ఎమ్యెల్యే లావూడ్య రాములు నాయక్
నవతెలంగాణ-వైరా
అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని వైరా ఎమ్యెల్యే లావూడ్య రాములు నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం వైరా ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయం నందు మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్యెల్యే రాములు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కృష్ణా నదిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరుకు ఇబ్బంది కలగడంతో పాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలలో వేలాది ఎకరాలకు సాగు తాగు నీటికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని దీని వల్ల నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఎన్ఎస్పీ -2 జోన్ పరిధిలోని వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా, ఏన్కూరు మండలాల్లో భూములకు సాగునీరు అందింది కానీ ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు వల్ల దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని దీనిపై తెలంగాణ రైతాంగం వ్యతిరేకించాలన్నారు. గతంలో నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద అక్రమంగా ప్రాజెక్టు నిర్మించడం వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని, ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రైతులంతా అండగా నిలవాలని ఎమ్మెల్యే రాము నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి మోహన్ రావు, టౌన్ పార్టీ అధ్యక్షుడు దార్న రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, కొణిజర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోసూరి శ్రీనివాసరావు, ఏన్కూర్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సురేష్ నాయక్, రైతుబంధు మండల కన్వీనర్ మేడ ధర్మారావు వైరా మాజీ ఎంపీపీ కృష్ణార్జున రావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.