Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అయితగోని. విజరు కుమార్
- ప్లకార్డ్స్ తో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకోసం ప్రభుత్వం వెంటనే అన్ని శాఖల ఖాళీలంన్నిటితో కలిపి జాబ్ క్యాలెండర్‌ని విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అయితగోని విజరు కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ క్యాంప్‌లో సుందరయ్య భవన్ నుండి సరితా క్లినిక్ వరకు నిరుద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగులకు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని వెంటనే భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు లక్షా 7వేల ఉద్యోగాలు 2 సంవత్సరాలలో భర్తీ చేస్తానని చేయలేదని , గతంలో ఎంఎల్‌సి ఎన్నికలప్పుడు 50వేలకు నోటిఫికేషన్లు ఇస్తానని హామీ ఇచ్చారని, దానికి కూడా భర్తీ ప్రక్రియ మొదలెట్టలేదని అన్నారు. రాష్ట్రంలో 1,91,126 ఖాళీలు ఉన్నట్లు పిఆర్సి నివేదిక వెలిబుచ్చిందని, ఈ ఖాళీలన్నింటికి నోటిఫికేషన్లు ఇచ్చేలా ఇయర్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలనారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజల బతుకులు చితికి పోయాయని, ఉద్యోగాలు ఊడిపోయ్యాయని అన్నారు. జిల్లా కార్యదర్శి షేక్. బషీరుద్దీన్ మాట్లాడుతూ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై కూడా ఇంతవరకు దాని విధివిధానాలను ప్రకటించకుండా అమలు చేయడం లేదని. నిరుద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మధాల ప్రభాకర్, జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, యంగ్ ఉమెన్ జిల్లా కన్వీనర్ పొల్లెపల్లి. శరణ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తెనపల్లి నరేష్,అశోక్, రాజు, జిల్లా నాయకులు నాగరాజు, శ్రీను, మధులత, మురళి, జక్కంపూడి కృష్ణ, అరవింద్, సాయి, పుష్ప రాజు తదితరులు పాల్గొన్నారు.