Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని రాయన్న పేట గ్రామానికి చెందిన పీడిత ప్రజల ఆశాజ్యోతి అమరజీవి తూము ప్రకాష్ రావు 39వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో తూర్పు బీళ్లు నుంచి తువ్వా చెలకకు వెళ్లడానికి మట్టితో నిర్మించిన నూతన రోడ్డును బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బత్తినేని నాగప్రసాద్ రావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులందరూ కలిసికట్టుగా రోడ్డు సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చారని దీంతో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ రోడ్డు పూర్తికావడానికి కొండ రామకృష్ణ, పారా వెంకటేశ్వర్లుతో పాటు మిగిలిన రైతులు చాలా కృషి చేశారని ఆయన వారిని అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు సహాయపడటానికి బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సీపీఐ మండల కార్యదర్శి వెంగళ ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు బెజవాడ రవిబాబు, ఏనుగు గాంధీ, తూము రోషన్ కుమార్, ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి టి అశోక్ సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ఏలూరు పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, బొమ్మినేని హనుమంతరావు, బొమ్మినేని కొండలరావు తదితరులు పాల్గొన్నారు.