Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
యడవల్లి లక్ష్మీపురం సీపీఐ(ఎం) నాయకులు, గ్రామసర్పంచ్ చెరుకుపల్లి వెంకన్న అకాల మరణం పార్టీకి కుటుంబానికి తీరనిలోటని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బండి రమేష్ అన్నారు. మండల పరిధిలో యడవల్లిలక్ష్మీపురం గ్రామ సీపీఐ(ఎం) నాయకులు సర్పంచ్ చెరుకుపల్లి వెంకన్న స్తూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వెంకన్న పార్టీ అభివృద్ధి కోసం పని చేశారన్నారు. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎర్ర జెండా పట్టుకొని కడవరకు పార్టీలోనే కొనసాగిరన్నారు. తొలుత పార్టీ పతాకాన్ని స్థూపం వద్ద మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ ఎగరవేశారు. అనంతరం వెంకన్న గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శి వెంకన్న ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు, నాయకులు కందుల భాస్కర్ రావు, టిఎస్ కళ్యాణ్ వై రవికుమార్, బట్టు పురుషోత్తం మద్దినేని దశరథరామయ్య, కుక్కల ముత్తయ్య ఎరుకల సైదులు, వేల్పుల భద్రయ్య, మరికంటి వెంకన్న, మర్లపాటి వెంకటేశ్వరరావు, కుక్కల రామచందర్, కుటుంబరావు, పార్టీ గ్రామకార్యదర్శి నల్లమోతు సురేష్, చెరుకుపల్లి ముత్తయ్య, రజినికుమార్, కిన్నెర ఉపేందర్ వెంకన్న కుటుంబసభ్యులు పాల్గొన్నారు.