Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులర్పించిన పోతినేని, పొన్నం
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
మండలంలోని ఎం.వెంకటా యపాలెం గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరుడు గుర్రం సీతారాములు(80) ఆదివారం మృతిచెందారు. గుర్రం సీతారాములు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌కు మామయ్య, గుర్రం సీతారాముల మృతదేహాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌లు సందర్శించి నివాళులు అర్పించారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గుర్రం సీతారాములు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో సిపిఎం మండల నాయకులు బందెల వెంకయ్య, పొన్నెకంటి సంగయ్య, పొన్నం వెంకటరమణ, యామిని ఉపేందర్, పల్లె శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ నాగండ్ల అచ్యుత్ రావు,చావా నాగేశ్వరరావు,వడ్లమూడి నాగేశ్వరరావు, కూసూ సంజీవరెడ్డి, బాలిన నాగేశ్వరరావు, మునిగంటి యాదగిరి తదితరులు ఉన్నారు.