Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న సైబర్ నేరాలు
- సత్తుపల్లి సీఐ రమాకాంత్
నవతెలంగాణ-సత్తుపల్లి
ఫేస్ బుక్‌లో అజ్ఞాత వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేయకపోవడం చాలా మంచిదని, రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్న దృష్ట్యా సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సత్తుపల్లి సీఐ ఎ. రమాకాంత్ సూచించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఫేస్ బుక్ లో అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించిన కొందరు, అశ్లీల చిత్రాలతో వలపన్ని, వీడియో కాల్స్ ద్వారా ఆకర్షించి, వాటిని రికార్డు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు సత్తుపల్లి ప్రాంతంలో కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు. వాటిని అంశాలను సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు పంపుతున్నామన్నారు. ఇటీవల స్థానిక పోలీసు సిబ్బంది కొందరికి సైబర్ క్రైమ్ పై ప్రత్యేక శిక్షణ అందించి అనుమానిత సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఓఎల్ఎక్స్ వంటి యాప్ లే కాకుండా సెకండ్ హ్యాండ్ వాహనాలు, వస్తువుల, క్రయ విక్రయాలు, ఇతరత్రా ఆన్లైన్ వ్యవహారాలలో నగదు బదిలీ అంశాన్ని చాలా జాగ్రత్తగా చేయాలన్నారు. నకిలీ ఫేస్బుక్ అకౌంట్లతో పరిచయస్తులుగా మారి అమౌంట్ రిక్వెస్ట్ చేస్తూ కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయన్నారు. యూజర్లు తప్పని సరిగా తమ ప్రొఫైల్ లాక్ చేసుకోవాలని సూచించారు.