Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత పార్టీపైనే విమర్శలు అ నిరాశలో మునుగోడు కాంగ్రెస్ క్యాడర్
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం ఇప్పుడున్న కాలంలో సాధారణంగా మారింది. ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీలు మారుతున్నారు. కానీ అభివృద్ధి గాలికి వదిలారు. ఇంకోవైపు ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచి మరో పార్టీని పొగుడుతున్న తీరు అందర్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతుంది. 'తాను కూర్చున్న చెట్టును తనే నరుక్కున్న ' చందంగా ఏ పార్టీ పేరుతో గెలిచారో ఆ పార్టీపై దుమ్మెత్తిపోయడం ఆయనకే చెల్లించింది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ( కోమటిరెడ్డి బ్రదర్స్) వీరిద్దరు స్వయనా సోదరులు. వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు భువనగిరి పార్లమెంటు సభ్యులు, మరోకరు మునుగోడు శాసనసభ్యులుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మాస్ ఫాలోయింగ్ కలిగిన నేతలిద్దరు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్ఆర్ను ఒప్పించి తన సోదరుడైన రాజగోపాల్‌రెడ్డికి 2009లో భువనగిరి పార్లమెంటు టికెట్ ఇప్పించి గెలిపించారు. నాటి నుంచి రాజకీయాలలో క్రీయాశీలకంగా ఎదిగారు. 2014 ఎన్నికలలో రెండోసారి ఎంపీగా పోటిచేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన స్థానికసంస్థల ఎన్నికలలో పాల్గొని అధికార టీఆర్ఎస్ పార్టీ కి మోజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019 శాసనసభ ఎన్నికలలో మునుగోడు శాసనసభ స్థానానికి పోటీచేసి విజయం సాధించారు.
సొంత పార్టీపైనే విమర్శలు
జిల్లాలో పట్టుకలిగిన నేతలలో కోమటిరెడ్డి బ్రదర్స్.. అందులో ఈ మధ్య ఎప్పుడు సొంతపార్టీపైనే హాట్ ... హాట్.. కామెంట్స్ చేస్తున్నది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి పీసీసీ అధ్యక్ష పదవిపై కన్నేసిన ఆయన తరచు పార్టీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలాంటిదని, అందులో కూర్చుంటే మునిగిపోవడం ఖాయమని పేర్కొన్నారు. బీజేపీ ఎదుగుదలను ఎవరు అడ్డుకోలేరని, తనను పార్టీలో రావాలని ఇప్పటికే ఆహ్వానం అందిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో బీజేపీలో చేరితే కాబోయే సీఎం తానేనంటూ తన పార్టీ కార్యకర్తతో మాట్లాడిన ఆడియోలీక్ అయ్యింది. దీంతో బీజేపీ ఆయన రాకను అడ్డుకున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత తిరుపతి దర్శనానికి వెళ్లిన సందర్భంలో కూడా బీజేపీలో త్వరలోనే చేరుతున్నట్టు ప్రకటించారు. గత ఎమ్మెల్సీ 4మిగతా 3లో...
ఆ ఎమ్మేల్యే...కాంగ్రెస్‌లో ...ఉండేనా.. ఊడేనా..
ఎన్నికల సమయంలో మునుగోడులో ఓ శుభ కార్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన ఓ నేతతో మాట్లాడుతూ 'మీ' గెలుపు కోసం అన్ని పార్టీలను ఏకం చేసేందుకు తానే చొరవ తీసుకుంటానని అన్నాడు. కానీ ఆనాటికే కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఆయన చేసిన కామెంట్‌పై కూడా పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఆ తర్వాత సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీచేయాలని ఆ పార్టీ అదిష్టానం తనను సంప్రదించిందని, తానే గనుక పోటీచేస్తే జానారెడ్డి మూడోస్థానానికి పడిపోవడం ఖాయమని బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు. ఇలా పలు సందర్భాలలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. పీసీసీ చీఫ్ ఎంపిక సందర్భంగా కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు.
ఉండేనా ... ఊడేనా....?
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు అవకాశం వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ అధినాయకత్వంపై తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలోని మండల పరిషత్ సర్వసభ సమావేశాలకు హాజరైన సందర్భం తక్కువే... ప్రజల సమస్యపై ఆయన స్పందన కూడా అంతంతగానే ఉంది. కరోనా సమయంలో కొంత మందికి అక్కడక్కడ కొంత మందికి సహాయం చేశారు. జిల్లాలో ఉన్న ఏకైన ప్రతి ఎమ్మెల్యే ఆయన ఒక్కరే .. కానీ ఆ స్థాయిలో ప్రజా సమస్యలపై స్పందించింది తక్కువే.. అధికార టీఆర్‌స్‌ను తీవ్రంగా విమర్శిస్తూనే.. కేంద్రంలో ఉన్న బీజేపీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. చండూరు జెడ్పీటీసీ విసిగిపోయి అధికార టీఆర్ఎస్ చేరారని సమాచారం. అంతేగాకుండా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పూర్తి మోజార్టీతో గెలిచిన ఎంపీపీ చండూరు ఒక్కటే. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఎక్కడ కూడా అందుబాటులో ఉండడంలేదని ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. ఇదంతా గమనిస్తే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో ఉండేందుకు ఏ మాత్రం ఇష్టంగా లేరని తెలుస్తోంది. ఆయన 'మన' పార్టీలో ఉండేనా.. ఊడేనా అనే సందిగ్ధతతో కార్యకర్తలు ఉన్నారు.