Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
కరోనా కష్ట కాలంలోనూ ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని అంతమ్మ గూడెం రూ.20 లక్షలు దోంతిగూడెం రూ.8 లక్షలు, కనుముకుల రూ.20 లక్షలు, ధర్మరెడ్డిపల్లి రూ.5 లక్షలతో సీసీ రోడ్లు అండర్ డ్రయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కాలానికనుగుణంగా వ్యవసాయ పంటలో మార్పు జరిగితే రైతులకు లాభం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలను నాటి పోషించాలని ప్రజలను కోరారు. ఇటీవల మరణించిన ఆయా గ్రామాల కుటుంబాలకు దోతి గూడెం 25కుటుంబాలకు రూ.5వేల చొప్పున పైళ్ల ఫౌండేషన్ ద్వారా రూ.లక్షా 25 వేలను అందజేశారు. కనుముక్కల 22 కుటుంబాలకు రూ.5వేల చొప్పున రూ.లక్షా 10 వేలను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం, జెడ్పీటీసీి కోట పుష్పలత, గాిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
జులై 10 వరకు పిల్లాయిపల్లి కాలువ ద్వారా సాగునీరు
జులై పదవ తేదీ వరకు పిల్లాయిపల్లి కాలువ ద్వారా పిల్లాయిపల్లి పెద్దగూడెం జగత్ పల్లి ,జలాల్పురం, మెహర్ నగర్, భీమనపల్లి, కనుముక్కల ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తామని భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ పనులు త్వరగా పూర్తి చేసే సాగునీరు అందించాలని అధికారులను కోరారు పనులు వేగవంతం చేయాలన్నారు పనుల్లో జాప్యం చేయకుండా వెంటనే త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు కాలువ నీరు అందక ఈ ప్రాంత రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లారు.