Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
ఏపీజీవీబీ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రీజినల్ మేనేజర్ విజరు భాస్కర్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఏపీజీవీబీ నూతన బ్యాంకు భవనాన్ని సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకు రూ.54 కోట్ల లావాదేవీల తోటి ముందుకు సాగుతుందని తెలిపారు. మహిళా సంఘ సభ్యులు, రైతులు, వివిధ గ్రామాల ప్రజలు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజివీబీ బ్యాంక్ మేనేజర్ అనిల్ కపాదానం, ఎస్సై డి. నాగరాజు,ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి కొంతం మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బుగ్గ శ్రీశైలం, భాస్కరుని రఘునాథ్ రాజు, బ్యాంక్ సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్ చెన్నకేశవులు, క్యాషియర్ సురేందర్, జంగవెల్లి ఆంజనేయులు, ఏపీవో సత్యనారాయణ, మల్లేశం, అలివేల, సిద్ధమ్మ, గ్రామస్తులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.