Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
బోడేపూడి విజ్ఞానకేంద్రం(బీవీకే) ఖమ్మం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, అమెరికా (టీడీఫ్), అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ (ఏఏపీఐ) ఫోరం సభ్యులు, రీజనల్ కో-ఆర్డినేటర్ మహేందర్ ఎనేపల్లి, ప్రెసిడెంట్ కవిత, ప్రీతి, శ్రీనివాస్ల సహకారంతో శేఖర్ రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లును సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావులకు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ వన్ టౌన్ కార్యదర్శి ఎం.ఎ. జబ్బార్ అధ్యక్షతన జరిగిన సభలో వారు పాల్గొని మాట్లాడుతూ కోవిడ్ పరిస్థితుల్లో అనేకమంది సరైన టైంలో ఆక్సిజన్ దొరక్క మరణించారని గుర్తు చేశారన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ప్రాణ వాయువులని వారన్నారు. కోవిడ్ మూడో దశ తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. బివికె ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసోలేషన్ సెంటర్ ద్వారా కోవిడ్ పాజిటివ్ వచ్చి, ఇప్పటికే అనేకమంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకొని తమ ఇళ్లకు వెళ్లారని వారు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి దగ్గరికి వారి సొంత కుటుంబ సభ్యులే వెళ్లలేని పరిస్థితిలో బివికే వాలంటీర్లు ఇంటిటికి వెళ్లి భోజనం అందించి మనోధైర్యాన్ని కల్పించారన్నారు. కోవిడ్ సందర్భంగా 50 రోజులుగా బీవీకే ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసోలేషన్ సెంటర్కి స్వచ్ఛంద సంస్థలు, వివిధ వ్యక్తులు ఇచ్చిన సహకారం మరువలేనిదన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లును అందించిన తెలంగాణ డవలప్మెంట్ ఫోరమ్, అమెరికా(టీడీఫ్),అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ (ఏఏపీఐ) ఫోరం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
పెద్ద మనసు చాటుకున్న చిన్నోడు
అభినందించిన పోతినేని, నున్నా
ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపే బాల్యం... అటువంటి చిన్నోడు బి. జ్వలిత్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఖమ్మం నగరానికి చెందిన జ్వలిత్ ఆరో తరగతి చదువుతున్నాడు. కోవిడ్ బాధితులకు అండగా నిలవాలని తపనతో తన స్నేహి తులతో కలిసి ఇంటింటికీ తిరిగి డబ్బులను కలెక్ట్ చేశాడు. అదే విధంగా తమ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా దాచి పెట్టుకొని బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి రూ.1827లను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, బీవీకే మేనేజర్ వై. శ్రీనివాసరావులకు అందజేశాడు. ఈ సందర్భంగా చిన్న వయసులో ఇటువంటి ఆలోచన చేయడం మంచి పరిణామం అన్నారు. జ్వలిత్ను అభినందించారు. జ్వలిత్ తండ్రి బి.మధు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శిగా, తల్లి శ్రీదేవి ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.
కార్యక్రమంలో బీవీకే మేనేజర్ వై శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వై.విక్రమ్, నందిపాటి మనోహర్, తుమ్మ విష్ణువర్ధన్, తుశాకుల లింగయ్య, రఘునాధపాలెం మండల కార్యదర్శి ఎస్. నవీన్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మెరుగు సత్యనారాయణ, డివైఎఫ్ఐ నాయకులు షేక్ బషీరుద్దీన్, బివికే నిర్వాహకులు రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, షేక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.