Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్తుపల్లి : దళిత జనోద్ధారకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దళిత క్రాంతి పథకం ద్వారా దళిత వర్గాల కల సాకారం కానుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దళిత క్రాంతి పథకాన్ని హర్షిస్తూ అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పుష్ఫాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. దళితుల స్వప్నం కేసీఆర్‌తోనే సాకారం కానుందన్నారు. ఇందుకోసం రూ. 1200 కోట్లతో దళిత సాధికారత పథకాన్ని ప్రవేశ పెట్టనున్నారని, అవసరమైతే మరో రూ. 500 కోట్లు కూడా దళితుల అభివృద్ధికి ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే సండ్ర స్పష్టం చేశారు. దళితుల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో దళిత యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. సొంత స్థలాలు ఉన్న వారికి డబుల్ ఇండ్లు కట్టించి ఇవ్వడానికి విధి విధానాలు రూపొందిస్తున్నారని, జిల్లాల వారీగా కలెక్టర్లతో కేసీఆర్ సామావేశం కానున్నట్లు తెలిపారు. జిల్లా వారీగా ఖాళీ స్థలల సమాచారం సేకరించాల్సిందిగా ఇప్పటికే మండల స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయన్నారు. జులై 1 నుంచి 10 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రధాన ఎజెండా ఉండబోతోందన్నారు. రాష్ట్రంలో 5 ప్రధాన కేంద్రాల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఐఏఎస్ అకడమీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సత్తుపల్లి మండల సర్పంచులు వేల్పుల కళావతి, మోదుగు నీలిమ, నల్లంటి ఉదయలక్ష్మి, చెట్టుమాల రేణుక, జక్కుల ప్రభాకర్, శ్రీదేవి, సొసైటీ అధ్యక్షుడు మోదుగు పుల్లారావు, ఎంపీటీసీ విస్సంపల్లి వెంకటేశ్వరరావు, వేంసూరు ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ మారోజు సుమలత, సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు పాల్గొన్నారు.
కల్లూరు : దళితులు సర్వతోముఖాభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఎం దళిత సాధికారత పధకం ను హర్షిస్తూ మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిదిగా పాల్గొని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజరు కుమార్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, రైసస సీనియర్ నాయకులు డా,, లక్కినేని రఘు, పసుమర్తి చంద్రరావు, పుల్లయ్య, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, సర్పంచ్‌లు నామ రాధమ్మ, గొల్లమందల ప్రసాద్, సింగిసాల పద్మ ప్రసాద్, కువ్వారపు విజయరావు, నందిగం ప్రసాద్, మోదుగు సుబ్బారావు, ఎంపీటీసీలు జినుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.