Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రగతి నిధులు హరితహారానికేనా..?
- ప్రజా సమస్యలు పరిష్కారం అయినప్పుడే పట్టణ ప్రగతి సాకారం
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించకుండా మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం సరైందికాదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా విమర్శించారు. స్థానిక శేషగిరిభవన్లో మంగళవారం జరిగిన మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పట్టణ ముఖ్య నాయకుల ''సమా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ శాఖ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరితహారం కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, ఐతే ఏడు దఫాలుగా హరితహారం కార్యక్రమంలో నాటిన లక్షలాది మొక్కలు జాడలే కుండా పోయాయన్నారు. హరితహారం పేరుతో లక్షలాది రూపాయలు నిధులు దుర్వినియోగం అవుతు న్నాయని ఆరోపించారు. పట్టణంలోని 36వార్జుల్లో అనేక సమస్యలు 'పెరుకుపోయి. ఉన్నాయని, వాటి పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాల్సిన అవ సరం ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ సిపి ఐ పక్ష నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్, బోయిన విజరు కుమార్, పి.సత్యనారాయణచారి, మాజీ మున్సిపల్ పక్ష నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.