Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
వంట నష్టపోయిన రైతాంగాన్ని బీమా అందించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కలెక్టర్ కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పంటల బీమాకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు డబ్బును చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం రావడం లేదన్నారు. గత మే నెలలో కురిసిన వర్షాల కారణంగా అరటి, మామిడి వంటి ఉద్యాన వంటలు దాదాపు 8,625 వేల ఎకరాలలో దెబ్బతినడంతో 2,086 మంది రైతులు రూ.6.26 కోట్లు నష్టపోయారని ఉద్యావనశాఖ ప్రాధమికంగా అంచనా వేసిందన్నారు. పంటల బీమా రాష్ట్రంలో అమలులో లేకపోవడంతో ఒక్క రూపాయి కూడా రైతులకు పరిహారం రాలేదన్నారు. 2018-19, 2019-20 లలో వానాకాలం, వేసవి కలిపి మొత్తం నాలుగు సీజన్లలో రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా పథకం కింద రూ. 900 కోట్లకు పైగా పరిహారం రెండేళ్ల క్రితమే వచ్చిందని. అయితే రాష్ట్ర వ్యవసాయశాఖ రూ. 450 కోట్లు ప్రీమియం రాయితీని కంపెనీలకు విడుదల చేయలేదని, దీంతో పరిహారం అందించేందుకు బీమా కంపెనీలు నిరాకరించాయన్నారు. రూ.450 కోట్లను బీమా కంపెనీలకు చెల్లించి రూ. 900 కోట్లను రైతులకు పరిహారంగా చెల్లించవలసిందిగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సానబోయిన శ్రీనివాస్ గౌడ్, విజరు, అప్పారావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.