Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
హరిత హారం కోసం పేదలు సాగుచేస్తున్న పోడుభూముల జోలికి వస్తే సహించేది లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కసాని ఐలయ్య అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. పొడుసాగుదరులపై అటవీ అధికారులు దాడులు ఆపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా పేదలు ఈ భూములను సాగుచేస్తు న్నారని అన్నారు. ఇలాంటి భూములను బలవంతం గా లాక్కొని పేదలను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, ఊకంటి రవికుమార్, లక్ష్మీ నర్సు, మధు, ఆదినారాయణ, రావుజా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.