Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం మోసాన్ని ఎండకడుతాం
- ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-భద్రాచలం
దళితులను మరోసారి మోసం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సాధికారత చేపట్టారని, దళిత అభివృద్ధి అంటే దెయ్యాలు వేదాలు వల్లించి నట్లు ఉందని మహాజన, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. భద్రాచలంలో టీఎస్ టూరిజం నందు విలేకర్ల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఏడు సంవత్స రాలుగా దళిత కుటుంబాలను మరిచిన కేసీఆర్ ఇప్పుడు దళిత సాధికారత పేరుతో మోసం చేస్తున్నా రని విమర్శించారు. గతంలో దళితుడిని ముఖ్య మంత్రి చేస్తానని, మూడెకరాల భూమి, ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు అనేక హామీలు ఇచ్చి మరిచిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులపై హత్యలు, అత్యాచారాలు చేయించడంలో ముందువ రుసలో ఉందని ఆయన మండిపడ్డారు. మరియమ్మ లాకప్ డెత్ కారణం పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు దేపంగి రమణయ్య మాదిగ, బోయ జగన్నాధం, అలవాల రాజా పెరియార్, బోయిళ్ళ వెంకటేశ్వర్లు, తిరుపతి, కృష్ణ, కొమ్మ గిరి, వెంకటేశ్వర్లు, వీర రాఘవులు, ప్రభాకర్, దుర్గ ప్రసాద్, దుర్గాప్రసాద్, అశోక్, నరేష్, శ్యామ్, రత్నం, తదితరులు పాల్గొన్నారు.