Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆషా వర్కర్లకు పారితోషికాలతో సంబంధం లేకుండ కనీసవేతనం నిర్ణయించి, అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫ్రంటు లైను వారియర్సుగా ఆషాలు కరోనా కాలంలో తమ ప్రాణాలను, తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి ఇంటింటి సందర్శనలు, కరోనా ఉన్నవారికి నిరంతర వైద్యసేవలు చేయటం జరిగిందని తెలిపారు. పారితోషికాలతో సంబంధం లేకుండా కనీస వేతనం రూ.19 వేలు అమలు చేయాలని, కరోనాతో చనిపోయిన ''ఆషా''లకు రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ఆషా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యలర్ చేయాలని, వేతనం పెంచి పిఆర్సీ అమలు చేసేవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా పారితో షికాలతో సంబంధం లేకుండా రూ.10 వేల వేతనం ఇవ్వాలని, గతంలో మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫ్ర్ కమీషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆశాలు పాల్గొన్నారు.