Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాడలేని జీతాలు
- కష్టతరంగా మారిన కుటుంబ పోషన
నవతెలంగాణ-అశ్వాపురం
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లుగా ఉంది అంగన్వాడీల కొలువుల పరిస్థితి. ప్రభుత్వం అంగన్వాడీలతో అన్ని రకాల పనులు చేయించుకుటున్నా వారికి వేతనాలను సకాలంలో అందించడంలో సంబంధిత శాఖ విఫలమవుతూనే ఉందనడంలో సందేహంలేదు. అంగన్వాడీలకు వేతనాలు సకాలంలో రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గత కొంత కాలంగా నెలన్నరకోసారి వేతనాలు వచ్చేవి కానీ గడసిన మే నెల వేతనం జూన్ మాసం పూర్తి అవుతున్నా రాకపోవడంతో రెండు నెలలుగా అంగన్వాడి టీచర్లు, ఆయాలు కుటుంబ పోషనకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బూర్గుంపాడ్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 158 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 121 మెయిన్, 37 మిని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు సకాలంలో వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
సకాలంలో వేతనాలు రాక కుటుంబ పోషన భారంగా మారుతోంది
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సకాలంలో వేతనాలు నావడంలేదని అంగన్వాడీలు అవేదన వ్యక్తంచేస్తున్నారు. నెల నెల రావాల్సిన వేతనాలు ఒక నెల ముగిసిన తర్వాత రెండవ నెల చివరిలో వస్తుందంటున్నారు. ఇలా రెండు నెలల కోసారి వేతనాలు రావడం వలన కుటుంబ పోషన చాల కష్టతరంగా మారుతోందని వారు వాపోతున్నారు. సర్కారుకు అవసరమైన పనులన్ని చేస్తున్న తమకు వేతనాలు అందించే విషయానికి వచ్చే సరికి ఇలా ఇబ్బందులు ఎదువరడం బాదకరంగా ఉందని అంగన్వాడీలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రతీ నెల 1 నుండి 10 తేదిలలోపు వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ప్రతీ నెల చివరి తేదీలోగా వేతనాలు చేసి డైరెక్టరేట్కు పంపిస్తాము ప్రమీల, సీడీపీఓ బూర్గుంపాడ్ ప్రాజెక్టు
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రతీ నెల చివరి తేదిన జీతాలు చేసి డైరెక్టరేట్కు పంపిస్తాము. వేతనాలు డైరెక్టరేట్ నుండే వేస్తారు. ఈ సారి కరోనా వలన ఆలస్యం అయి ఉండవచ్చును. రెండు రోజుల్లో వేతనాలు పడే అవకాశం ఉంది.