Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
పోడు సాగుదారుల పట్ల డీఎఫ్ఓ సానుకూలంగా స్పందిచారని సీపీఐ(ఎం) కార్యదర్శి భిక్షం అన్నారు. మంగళవారం వారు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండలంలోని పాపకొల్లు రెవెన్యూ పరిధిలో జూలూరుపాడు రేంజ్ పరిధిలో బొజ్యతండా ఫుల్లు తండా గ్రామ రైతులకు 2005 సంవత్సరంలో పూర్వం నుంచి చెట్టు పుట్టను తీసుకొని వ్యవసాయం చేసుకుంటు తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కావాలని ఫారెస్ట్ స్థానిక అధికారులు రైతుల భూములులో కాల్వలు తవ్వించి, పోడు సాగు దారులను నిరాయిసులుగా చేస్తున్నారు. వారి జీవన భృతిపై దెబ్బతీస్తున్నారు. ఆ గ్రామ రైతులకు కోడ్ హక్కు చట్టం 2005 పూర్వం నుంచి ఆ భూముల్లో ఉన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా వారి మొండి వైఖరితో రైతుల పంట వేయకుండా అడ్డుకోవటం కేసులు పెడుతూ హెచ్చరించడం బెదిరింపులకు గురి చేస్తున్నారు. అదే గ్రామంలో ఒక రైతు మాల్ పూరి గుడిస అగ్నికి దగ్ధం అయింది. ఇందులో వీరికి ఇచ్చినప్పుడు హక్కు చట్టం కాలిపోయింది. ఇంకో రైతు మాలోత్ స్వామి వీరికి పట్టా ఉంది. అయినా పోడు భూమిపై వెళ్లటం లేదు. ఈ విధంగా రైతులకు రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులు బ్యాంకులో వేస్తుంది. అదే గ్రామానికి చెందిన 18 రైతులు వీరికి ఐటీడీఏ వారు సర్వే నిర్వహించి క్లైం నెంబర్ కూడా ఇచ్చారు. అయినా వీరిని భూమి పైకి వెల్లనీయడం లేదు. ఈ సమస్యలపై డీఎఫ్ఓ జిల్లా అధికారి రంజిత్ కుమార్ సానుకూలంగా స్పందించి వీరు సమస్యలపై పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చీమల పాట భిక్షం, బానోత్ ధర్మ, వెంకటి, మాలోత్ సురేష్, స్వామి, వినోద్ కుమార్, రవి, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.